![]() |
![]() |
డాన్స్ ఐకాన్ సీజన్ 2 మంచి కలర్ ఫుల్ డాన్స్ లతో ఫుల్ జోష్ తో మద్యమద్యలో బ్రహ్మముడి కావ్య కామెడీతో షో నిండుగా వెళ్తోంది. ఐతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో మెంటర్ జానులూరి ఆమె కంటెస్టెంట్ సోనాలి ఎలిమినేట్ ఐన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో కూడా రిలీజయింది. ఇంకా సెకండ్ ఎలిమినేషన్ కూడా వచ్చేసింది. ఈ సెకండ్ ప్రోమోలో కూడా ప్రాకృతి- వర్తిక జా, మానస్ - సాధ్వి మధ్యలో ఫుల్ ఫైట్ ఐతే జరిగింది. "నేను మానస్ -సాధ్విని" ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పింది ప్రాకృతి. "సాధ్వి క్లాసికల్ లో చాలా బాగా చేసింది. అది ఆర్ట్ ని మాష్టర్ చేసింది" అని చెప్పింది. దానికి సాధ్వి ఫుల్ ఫైర్ అయ్యింది. " నీకు ఎలా తెలుసు క్లాసికల్ డాన్సర్ లో మాష్టర్ ని అని...ఇండియాలో ఎన్ని రకాల క్లాసికల్ డాన్సస్ ఉన్నాయో చెప్పగలవా నాకు" అని సాధ్వి అడిగేసరికి ప్రాకృతి ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. తర్వాత మానస్ అందుకున్నాడు "ఆఫ్ ది స్టేజిలో ఒకలా ఉండడం ఆన్ ది స్టేజికి వచ్చాక లైంలైట్ కోసం ఒకలా బిహేవ్ చేస్తోంది" అని నాకు అనిపిస్తోంది అంటూ ప్రకృతి మీద మండిపడ్డాడు. "ఎక్కడ నామినేషన్ వస్తుందో నేను అన్ బయాస్ గా అందరినీ ఈక్వల్ గా చూసి ఇవ్వాలి కదా " అని ప్రాకృతి రివర్స్ కౌంటర్ వేసింది. "అన్ బయాస్డ్ అనే పదం మీరు వాడకండి..ప్లీజ్ ప్లీజ్" అంటూ మానస్ - సాధ్వి వెటకారంగా నవ్వేశారు. "నేను మీతో మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను...కానీ మీరు ఫేస్ చూసి రెస్పెక్ట్ లేకుండా నవ్వుతున్నారు" అంటూ ప్రకృతి చెప్పింది.
![]() |
![]() |